![]() |
![]() |
.webp)
'కార్తీకదీపం' సీరియల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సోమవారం జరిగిన ఎపిసోడ్-1557 లో మోనిత మాట్లాడిన మాటలను కార్తిక్, దీప గుర్తు చేసుకుంటారు. "డాక్టర్ బాబు.. నా జీవితంలో మొదటి సారి భయంగా ఉంది" అంటూ దీప ఏడుస్తుంది. "అలా ఎందుకు భయపడుతున్నావ్ దీప" అని కార్తిక్ అడుగుతాడు. "నేను పోయాక మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు ఆ మోనిత. మీ ప్రమేయం లేకుండా మీ బిడ్డకు తల్లి అయింది. నేను పోయాక మిమ్మల్ని తలుచుకుంటే భయమేస్తుంది. నన్ను బ్రతికించండి. మీతో కలిసి వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని ఉంది. కానీ నా తలరాత ఇంతే.. నాకు మీతో కలసి బ్రతికే అవకాశం లేదు. కానీ మోనిత మాత్రం మీ జీవితంలో కి రావొద్దు. ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్ బాబు" అని కార్తీక్ తో చెప్పుకుంటూ బాధపడుతుంది.
మరో వైపు సౌందర్య లేచి బయటకొస్తుంది. ఇంటి ముందే ఉన్న దీపని చూసి ఆశ్చర్యపోతుంది. "అమ్మా.. దీప వచ్చేశావా.. ఎన్ని రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నాం. దేవుడు మా మొర ఆలకించాడు" అని ఏడుస్తుంది. "అత్తయ్య.. మీతో మాట్లాడాలి" అని దీప అడుగుతుంది. " చెప్పమ్మ దీప" అని సౌందర్య అనేసరికి, దీప మాట్లాడుతూ "నాకొక మాట ఇవ్వండి అత్తయ్య. మీ కొడుకుని మీ దగ్గరకి తీసుకొస్తాను. అలా తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ మాట తప్పద్దు" అని అంటుంది. "అసలేం జరిగింది దీప. కార్తీక్ ఎక్కడున్నాడు. నాతో అన్ని చెప్పుకునే నువ్వు.. ఈ రోజు ఏదో దాస్తున్నావ్ అంటే నాకు భయమేస్తుంది దీప" అని సౌందర్య అంది. "మీకు అన్నీ చెప్తాను. పదండి" అని దీప అంటుంది.
మోనిత తన ఫోన్ లో కార్తీక్ ఫోటో చూస్తూ.. హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన చారుశీల అది చూసి "ఏం చేస్తున్నావ్ మోనిత?" అని అడుగుతుంది. "నా కార్తీక్ ని చూస్తున్నాను. చూడు ఎంత బాగున్నాడో" అని అంది మోనిత. "అవును మోనిత. కార్తీక్ సర్ బాగున్నాడు" అని అంది చారుశీల. ఆ తర్వాత మోనిత మాట్లాడుతూ "అందుకేనా నాకు కాంపిటీషన్ గా వచ్చావ్?" అని అడుగుతుంది. "అదేం లేదు" అని అంటుంది చారుశీల. "నేను కార్తీక్ గురించి ఒకరిని చంపి, జైలుకి వెళ్ళాను. ఒకరిని చంపితే హంతకుడు అంటారు. వంద మందిని చంపితే వీరుడు అంటారు. నన్ను వీరవనితని చెయ్యొద్దు" అని చారుశీలకి వార్నింగ్ ఇస్తుంది మోనిత.
హిమ, శౌర్య ఇద్దరూ వాళ్ళ అమ్మా నాన్నలని వెతుక్కుంటూ తిరుగుతారు. అప్పుడే శౌర్య చేతిలో ఉన్న డబ్బుని దొంగ ఎత్తుకెళ్తాడు. దొంగని ఆపే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కిందపడిపోతుంటే..కార్తీక్ వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |